ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుతో పాటు భర్త వెంకట దత్తసాయి, ఇతర కుటుంబ సభ్యులను శుక్రవారం తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడలో సింధు కుటుంబ సభ్యులను కలిసి భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించి, దేశం గర్వించదగిన స్థాయిలో నిలబడాలని ఆకాంక్షించారు. సింధు మావయ్య వెంకటేశ్వరరావు తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ, ఆయన కుటుంబానికి మంచి అప్తమిత్రులు. ఆమె క్రీడా ప్రతిభ ఎంతోమంది యువతకు స్ఫూర్తిగా నిలుస్తోందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ కొనియాడారు.


