ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవం సందర్భంగా తణుకు డ్రగ్గిస్ట్ కెమిస్ట్ అసోసియేషన్ హాల్ నందు ఫార్మసిస్ట్ అసోసియేషన్ తరఫున ఫార్మాసిస్ట్ లు సమావేశం ఏర్పాటు చేసుకుని సమస్యల పట్ల చర్చించి, ప్రజలకు మందుల వినియోగం పట్ల అవగాహన కల్పించాలని, మత్తు మందులు వినియోగించే వారిని గుర్తించి వారికి దుష్పరిణామాల పట్ల అవగాహన కల్పించి వైద్యుల సూచనల మేరకు వారికి మాత్రమే యాంటిబయాటిక్స్ మందులు ఇవ్వాలని ఔషధ నియంత్రణ అధికారి మల్లిఖార్జున్ ఫార్మాసిస్ట్ ల కి సూచించారు. ప్రభుత్వ, ప్రైవేటు ఫార్మసిస్ట్ ల సమస్య ల గురించి పలు విషయాల చర్చించి పరిష్కారం చూపించాలని ప్రభుత్వాన్ని కోరాలని సభ్యులు అందరూ సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ కార్యదర్శి రామ్ చందర్, ఫార్మాసిస్ట్ ల సంక్షేమ రాష్ట్ర ఉప కార్యదర్శి కృష్ణ , ఉమ్మడి జిల్లా నుంచి పలువురు ఫార్మాసిస్ట్ లు పాల్గొన్నారు. సీనియర్ ఫార్మాసిస్ట్ లకు చిరు సత్కారం నిర్వహించి వారి సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా ఉదయం రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ నందు 15 మంది రక్తదానం చేసారు.


