దేవి శరన్నవరాత్రులు పురస్కరించుకుని విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసిన కనకదుర్గమ్మను ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ గురువారం దర్శించుకున్నారు. నవరాత్రుల్లో భాగంగా శ్రీ కాత్యాయని దేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని రాధాకృష్ణ కుటుంబ సమేతంగా దర్శించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. తణుకు నియోజకవర్గ పరిధిలోని ప్రజలు అంతా సుఖసంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా అమ్మవారిని కోరుకున్నట్లు ఆయన వెల్లడించారు.


