ఆచంటలో ఘనంగా దీన్ దయాల్ ఉపాద్యాయ జయంతి

భారతీయ జనతా పార్టీ సిద్దాంత కర్త, జనసంఘ్ ద్వితీయ అధ్యక్షులు పండిత్ దీన్ దయాల్ ఉపాద్యాయ జయంతి వేడుకలను ఆచంట మండల బిజెపి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆచంట మండల బిజెపి మాజీ అధ్యక్షులు ముచ్చర్ల నాగసుబ్బారావు మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, జాతీయ సమైక్యత సమగ్రత కోసం బలమైన రాజకీయ పక్షం ఏర్పడాలనే కాంక్ష తో శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి నేతృత్వంలో జన్ సంఘ్ పార్టీ స్థాపించడం జరిగిందని,వ్యవస్తాపక ప్రదాన కార్యదర్శిగా, తదుపరి జనసంఘ్ అధ్యక్షులు గా వ్యవహరించి పార్టీ ని దేశం వ్యాప్తంగా అన్నివర్గాల ప్రజలకు చేరువ చేయడానికి అహర్నిశలు కృషి చేసారని పార్టీ కి ఆర్థిక పరమైన సిద్దాంతాన్ని రూపొందించారని అన్నారు. ఏకాత్మతా మానవతా వాదం అనే సైద్ధాంతిక అవగాహన ద్వారా జనసంఘ్ పార్టీ కి రాజకీయ, ఆర్థిక విధానాన్ని అందించారని, అట్టడుగున ఉన్న పేద ప్రజలకు ఆర్థిక ఫలితాలు ముందుగా అందాలని , ప్రతి మానవుడి శరీరం, మనస్సు, తెలివితేటలు ఆత్మ యొక్క ఏకకాల సమగ్ర కార్యక్రమాన్ని సూచించే సమగ్ర మానవతావాదం అనే రాజకీయ తత్వాన్ని ఆయన రూపొందించరని అన్నారు. తదుపరి రాజకీయ పరిణామాలలో జనసంఘ్, భారతీయ జనతా పార్టీగా రూపాంతరం చెందినా .. ఈయన ప్రవచించిన ఆర్థిక సిద్ధాంతాన్నే భారతీయ జనతా పార్టీ ఆలంబనగా చేసుకొని అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను అమలు చేస్తుందని ఆయన జీవన విధానమే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు పాఠ్యాంశమని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి అందే బసవ గణపతి, సీనియర్ నాయకులు నెక్కంటి లక్ష్మణరావు, వేండ్ర సిద్దయ్య, కోనా సత్య ప్రసాద్, చెల్లు బోయిన ఉమామహేశ్వర రావు, దిర్శిపో శ్యాంబాబు, ఆరిమిల్లి సత్యనారాయణ, ఖండవల్లి వెంకట్రావు, ముమ్మిడివరపు నాగేశ్వరరావు, నేలపాటి ఏసురత్నం తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link