ఈ నెల 15,16 తేదీల్లో సచివాలయంలో జరుగనున్న జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ కు సంబంధించి నేడు ఉండవల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిర్వహించిన సన్నాహక సమావేశంలో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్, సహచర మంత్రులు
ఐదేళ్లలో 125 కేబినెట్ సమావేశాలు, 25 కలెక్టర్ కాన్ఫరెన్సుల నిర్వహణ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని వెల్లడించిన మంత్రి కందుల దుర్గేష్.
ప్రభుత్వం అందిస్తున్న పౌరసేవలతో పాటు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజల్లో సంతృప్తే ముఖ్యమని, రాష్ట్రస్థాయి నుండి క్షేత్రస్థాయి వరకు విజన్ స్పష్టంగా అమలు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించినట్లు ఈ సందర్భంగా తెలిపిన మంత్రి కందుల దుర్గేష్.
15 శాతం వృద్ధి రేటు లక్ష్యంగా పనిచేయాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించినట్లు తెలిపిన మంత్రి కందుల దుర్గేష్.
ఈసారి జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్సును విభిన్నంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు తెలిపిన మంత్రి కందుల దుర్గేష్.
ప్రధానంగా పౌరసేవలు, పథకాల అమలుపై జిల్లాల వారీగా జవాబుదారీతనం ఉండేలా ఈ కాన్ఫరెన్సు నిర్వహించనున్నట్టు తెలిపారని పేర్కొన్న మంత్రి కందుల దుర్గేష్.
మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా మెరుగైన పాలన అందించే అంశంపై అధ్యయనం చేస్తూ ఉండాలని సీఎం గారు సూచించినట్లు తెలిపిన మంత్రి కందుల దుర్గేష్.
రెండు రోజుల పాటు జరిగే కలెక్టర్ల సదస్సులో మొదటి రోజున జీఎస్డీపీ అంశంపై ప్రజెంటేషన్ లో భాగంగా సేవలు, పరిశ్రమలు, వ్యవసాయం, పర్యాటకం తదితర రంగాల పురోగతిపై సమీక్షిస్తామని తెలిపారని వెల్లడి
ఇక రెండో అంశంగా సంక్షేమం, సూపర్ సిక్స్, అన్నా క్యాంటీన్లు, పీ4 తదితర అంశాలను సమీక్షించనున్నట్టు, మూడో అంశంగా లాజిస్టిక్స్, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల గురించిన ప్రజెంటేషన్ ఉంటుందని, నాలుగో అంశంగా స్వచ్ఛాంధ్ర, సర్క్యులర్ ఎకానమీ, పంచాయితీరాజ్, మున్సిపల్ తదితర అంశాలపై జిల్లాల వారీగా పురోగతి తెలుసుకుంటామని సీఎం స్పష్టం చేసినట్లు తెలిపిన మంత్రి.
రెండో రోజున ఐదో అంశంగా మానవ వనరుల అభివృద్ధి, వైద్యారోగ్యం, విద్య, స్కిల్ డెవలప్మెంట్, ఆరో అంశంగా ఐటీ, క్వాంటం వ్యాలీ, ఆర్టీఐహెచ్, వాట్సప్‌లో పౌరసేవలు, డేటా లేక్, ఏఐ తదితర అంశాలను చర్చిస్తామని, ఏడో కేటగిరీలో రెవెన్యూ విభాగంలో భూములు, ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, మైనింగ్, ట్రాన్స్పోర్ట్ లాంటి అంశాలపై జిల్లాల వారీగా వివరాలు తెలుసుకుంటామని, 8వ అంశంగా రాష్ట్రంలో శాంతిభద్రతలపై ఎస్పీలు, జిల్లా కలెక్టర్లతో సమీక్షిస్తామని సీఎం తెలిపినట్లు వెల్లడించిన మంత్రి కందుల దుర్గేష్.


