లోక్ అదాలత్ లో కేసులురాజీ వల్ల విలువైన సమయం డబ్బు ఆదా

. చైర్మన్ మరియు నాలుగవ అదనపు జిల్లా జడ్జి డి.సత్యవతి తణుకు కోర్టు భవనముల సముదాయములో జరిగిన జాతీయ లోక్ అదాలత్ లో మొత్తం 650 కేసులు రాజీ చేశారు, దానిలో సివిల్ కేసులు 23, క్రిమినల్ కేసులు 605, ప్రీ లిటిగేషన్ కేసులు 22 ఉన్నవి. ప్రతి ఒక్కరు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి అని, చట్టం తెలియక చాలామంది ఇబ్బందులకు గురవుతున్నారని, లోక్ అదాలత్ లో కేసులు రాజీ చేసుకొనుట వల్ల విలువైన సమయాన్ని డబ్బును ఆదా చేసుకోవచ్చని, అలాగే ఏళ్ల తరబడి పెండింగ్ ఉన్న కేసులు మీడియేషన్ ద్వారా రాజీ చేసుకో వచ్చని కక్షిధారులకు తెలియచేశారు, మరలా డిసెంబర్ నెలలో జరుగు జాతీయ లోక్ అదాలత్ ను ఇప్పుడు సద్వినియోగం చేసుకోలేనివారు అప్పుడు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు డి. సత్యవతి, కె.కృష్ణసత్యలత, సాయిరాం పొతర్లంక, బెంచ్ మెజిస్ట్రేట్ తాడి ఆంజనేయులు, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సూరంపూడి కామేష్, న్యాయవాదులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link