అభినందించిన ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ
తణుకు నియోజకవర్గంలోని పలు దేవాలయాలకు సంబంధించి పాలకవర్గాల నూతన కమిటీలను నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు నూతన కమిటీ అధ్యక్షులు, సభ్యులను ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అభినందనలు తెలిపారు. ఆయా ఆలయాల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. తణుకు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, సీతారామాంజనేయ స్వామి వారి దేవాలయం, అత్తిలి మండలం మంచిలి పుంతలో ముసలమ్మ అమ్మవారి దేవాలయం, అత్తిలి మండలం ఉనికిలి గ్రామంలో రామలింగేశ్వర స్వామి వారి దేవాలయం, అత్తిలి మండలం గుమ్మంపాడు భీమేశ్వరస్వామి వారి దేవాలయం, తణుకు కేశవస్వామి వారి దేవాలయం, ఇరగవరం మండలం రేలంగి గోపాల ఆంజనేయస్వామి వారి దేవాలయం, తణుకు కేశవస్వామి, మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం, ఇగరవరం పాలేశ్వర, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం, తణుకు మండలం దువ్వ దానేశ్వరి అమ్మవారి దేవాలయాలకు సంబంధించి అధ్యక్షులు, సభ్యుల నియామకం జరిగింది.


