సామాజిక ఆరోగ్య కేంద్రం నిడదవోలు నందు శుక్రవారం జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా క్షయ వ్యాదిగ్రస్తుల గురించి ఇంటెన్సిఫైడ్ కేస్ ఫైండింగ్ క్యాంప్ డాక్టర్ పైయాజ్ అన్సారీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిఎన్ఎమ్ఓ డాక్టర్ హారిక గారు మాట్లాడుతూ టీబీఎంబీఏ కార్యక్రమంలో భాగంగా అర్బన్ హెల్త్ స్టాఫ్ ఏఎన్ఎంలు ఆశాలతో టీబీ వ్యాధి పట్ల శిక్షణ శిబిరం నిర్వహించారు చికిత్స గురించి అవగాహన వ్యాధిగ్రస్తులను గుర్తించడం వారికి పరీక్షలు చికిత్స వీటి మీద సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్షయ వ్యాధిగ్రస్తులకు పోషకాహార బుట్టలు అందించడానికి దాతలు ముందుకు రావాలని కోరారు. ఈ నెల 17-09-2025 & 02-10-2025 నుంచి
స్వస్థ నారి సశాక్త పరివార అభియాన్ కార్యక్రమంపై అవగాహన కల్పించి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిపిఎస్ లక్ష్మి సుందరి హెడ్ నర్స్ ఎఫ్సీబా స్టాఫ్ నర్స్ నాగమణి ఎస్ టి ఎస్ పోతురాజు ఎస్టిఎల్ఎస్ రత్నకుమారి టి.బి. హెవి సమీరా ల్యాబ్ టెక్నీషియన్ రాజ్ కుమార్ భవ్య ఎఫ్ సి రజిని ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.


