తారకపురి లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇరగవరం కాలనీ నివసిస్తున్న ఎస్. రామకృష్ణ, శైలజ దంపతుల కుమారుడు నాగ గోవింద్ అనే రెండు సంవత్సరాలు బాలుడు తల్లి వంట చేస్తుండగా వేడి గంజి, ముఖము శరీరంపై పడి బాబు తీవ్రంగా గాయాలపాలయ్యాడు. బాలుడు పరిస్థితిని తెలిసిన శ్రీ తారకపురి ప్రెసిడెంట్ లయన్ వావిలాల పవన్ కుమార్ పదివేల రూపాయలు ఆ బాలుని వైద్య నిమిత్తం సహాయం అందించినారు. ఈ సందర్భంగా పవన్ కుమార్ మాట్లాడుతూ ఇలాంటి విషమ పరిస్థితులు ఏర్పడినప్పుడు ఆయా కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని ఇచ్చి మానవత్వం చాటుకోవాలని తెలిపారు. సెక్రెటరీ రాంకుమార్ మాట్లాడుతూ శ్రీ తారకపురి లయన్ సేవలో కష్టంలో ఉన్న ఈ ఫ్యామిలీని ఆదుకోవడం తృప్తికరమైన సేవ అన్నారు. GAT నెంబర్ వావిలాల సరళ దేవి మాట్లాడుతూ బాబు పరిస్థితి తెలిసిన వెంటనే చిన్న పిల్లల వైద్యులు డాక్టర్ రాజు, బాబుకి సరైన సమయంలో మంచి వైద్యం అందించారని దానికి తోడుగా క్లబ్ కూడా ఆర్థిక సహాయం చేయడంతో ఆ కుటుంబానికి కొంత ఊరట నిచ్చిందన్నారు, ట్రెజరర్ గోపి మాట్లాడుతూ మానవసేవే మాధవసేవ అని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో క్లబ్ డైరెక్టర్స్ వావిలాల వెంకట రమేష్, ఆకురాతి శ్రీనివాస్, వి. సుబ్రహ్మణ్యం, బత్తుల వెంకటరమణ, ఏ. సత్యనారాయణ, k శ్యామల, ఏ గంగాధర్, వి. జ్యోతి తదితరులు లైన్ మెంబర్స్ పాల్గొన్నారు.


