towards a Tobacco Free Generation: The School Challenge అనే కార్యక్రమంలో భాగంగా తణుకు బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు Essay writing, debate, Drawing కాంపిటీషన్స్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి కందుకూరి పద్మావతి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో విద్యార్థులచే పొగాకు రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతిజ్ణ చేయించడం జరిగింది. కార్యక్రమానంతరం విద్యార్థులచే స్లొగన్స్ తో తయారు చేయబడిన ప్లకార్డులతో పాఠశాల నుండి వెంకటేశ్వర థియేటర్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో SMC కో ఆప్టెడ్ మెంబర్ శ్రీ మారుతీరావు, పాఠశాల ఎస్ఎంసి చైర్మన్ శ్రీమతి వెంకటలక్ష్మి, ఎస్ఎంసి సభ్యులు పాఠశాల స్టాఫ్ సెక్రటరీ కే సోమేశ్వరరావు, ఉపాధ్యాయులు పాపారావు, సంజయ్ గాంధీ, ch. రాజు, వెంకట రాజు, ఆర్మీ నేవీ స్కౌట్ అండ్ గైడ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


