ఆటో కార్మికుడు ఆత్మహత్య ప్రయత్నం ప్రభుత్వం ఐదు లక్షలు నష్టపరిహారం ఇవ్వాలి ఆటో అండ్ ట్రాలీ కార్మికులయూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వేల్పూరు గ్రామానికి చెందిన కోల రాంబాబు ఆటో కార్మికుడు మంగళవారం నాడు ఆటో కిరాయిలు లేక ఫైనాన్స్ చెల్లించలేక ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాడని అతన్ని బుధవారం నాడు తణుకులో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం పొందుతున్న అతనిని యూనియన్ నాయకులు కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా కరి నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన స్త్రీ శక్తి ఫ్రీ బస్సు పథకం వలన ఆటో కార్మికులు పూర్తిస్థాయిలో నష్టపోయారని ముందుగా ఆటో కార్మికులకు నష్టం జరగకుండా ప్రభుత్వము ప్రతిన్నమయ్య ఏర్పాట్లు చేయకపోవడం వల్ల ఆటో కార్మికులు ఆర్థికంగా నష్టపోతున్నారని అన్నారు. ఈ రాష్ట్రంలో సుమారు ఆరులక్షల మంది ఆటో కార్మికులు విద్యావంతులు, నిరుద్యోగులు ఉపాధి కోసం ప్రైవేటు ఫైనాన్స్ నుండి అధిక వడ్డీలకు ఆటోలను కొనుగోలు చేసి ఫైనాన్స్ లు చెల్లించలేక ఆర్థిక పరగా కుటుంబాలు చితికి పోతున్నాయని అన్నారు. ఇప్పటికే స్పేర్ పార్ట్లు, పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయని వాటిని అరికట్టడంలో ప్రభుత్వము విఫలమైందని నాగేశ్వరరావు అన్నారు. ఆటో కార్మికులకు ప్రభుత్వం ఆదుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉద్యమాన్ని నిర్వహిస్తామని ఆత్మహత్య కు ప్రభుత్వ మే కారణమని అతను కుటుంబానికి
5 లక్షలు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆటో యూనియన్ తణుకు ఏరియా అధ్యక్షులు పంగం రాంబాబు మాట్లాడుతూ పథకాలు పెట్టేముందు ప్రభుత్వం ఆలోచించాలని, ఓట్ల రాజకీయంతో ఆటో కార్మికుల పొట్టను కొట్టరాదని ప్రభుత్వాన్ని తెలిపారు. ఆటో కార్మికులు సమస్యలు పరిష్కారం కోసం ఉద్యమాన్ని నిర్వహిస్తున్నామని ప్రభుత్వం పరిష్కరించ పక్షంలో చలో అసెంబ్లీ కార్యక్రమానికి వెనకాడమని రాంబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ కార్యదర్శి విశ్వేశ్వరరావు న్యాయవాది కామన మునిస్వామి పాల్గొన్నారు.


