….జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు గుర్రపు డెక్క నుండి వర్ని కంపోస్ట్ తయారీ, ఎస్ జి హెచ్ సి మహిళల ఉపాధి అంశంపై జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి బుధవారం సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ గుర్రపు డెక్క నుండి వర్మి కంపోస్ట్ రూపొందించడంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. ప్రతి మండలంలో మూడు యూనిట్లు తప్పనిసరిగా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. వర్మీ కంపోస్ట్ సాగు పొలాలకు, ఉద్యానవన క్షేత్రాలకు ఎంతో మేలు చేకూరుస్తుందన్నారు. వర్మీ కంపోస్ట్ తయారీ వలన యూరియా వినియోగం కూడా తగ్గుతుందన్నారు. భీమవరం మండలం గొల్లవాని తిప్ప, పాలకోడేరు మండలం గొల్లలకోడేరు, ఆకువీడు మండలం సిద్దాపురం గ్రామాలలో గుర్రపు డెక్క ద్వారా కంపోస్ట్ ఎరువు తయారీ కేంద్రాలను ప్రారంభించి వినియోగంలోనికి తీసుకురావడం జరిగిందన్నారు. త్వరలో ఆకువీడు మండలం దుంపగడప, పాలకోడేరు మండలం పాలకోడేరు, కాళ్ల మండలం ఏలూరుపాడులో యూనిట్లు ప్రారంభానికి చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఎస్ హెచ్ జి లకు ఉపాధి అవకాశం ఏర్పాటుకు ఇది ఒక చక్కని అవకాశం అన్నారు. ఎంపీడీవోలు, వ్యవసాయ శాఖల కన్వర్జెన్సీతో డిఆర్డిఏ సమన్వయం చేసుకుంటూ పెద్ద ఎత్తున గుర్రపు డెక్క వర్మీ కంపోస్ట్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఎంఎస్ఎస్ వేణుగోపాల్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు, డ్వామా పీడీ డా.కెసిహెచ్ అప్పారావు, డీపీఎమ్ లు కె.కుసుమ కుమారి, ఏపీఎం లు టి.మురళీకృష్ణ, , ఏపీఎంలు పాల్గొన్నారు.


