:- రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్
పెరవలి మండల కేంద్రంలోని దీపిక ఫంక్షన్ హాల్ లో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి దుర్గేష్
50 మంది బాధితులకు రూ.40.01 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్ వోసీ పత్రాలు పంపిణీ
ఇప్పటివరకు నిడదవోలు నియోజకవర్గంలో సీఎం సహాయ నిధి క్రింద 344 మందికి రూ.2.84 కోట్ల లబ్ధి చేకూర్చామని మంత్రి దుర్గేష్ వెల్లడి
నిడదవోలు సమగ్రాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని స్పష్టం..టెండర్లు ఖరారు అయిన వెంటనే నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణం ప్రారంభం
ప్రజల ఆరోగ్యం, నియోజకవర్గం అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసేందుకు నిత్యం అందుబాటులో ఉంటానని మంత్రి దుర్గేష్ హామీ
నిడదవోలు: ఓ వైపు ప్రజల ఆరోగ్యం, మరోవైపు నిడదవోలు నియోజకవర్గం అభివృద్ధి, ఇంకోవైపు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. సోమవారం పెరవలి మండల కేంద్రంలోని దీపిక ఫంక్షన్ హాల్ లో మంత్రి కందుల దుర్గేష్ స్వయంగా నిడదవోలు నియోజకవర్గంలో అనారోగ్యం బారిన పడిన 50 మంది బాధితులకు రూ.40.01 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్ వోసీ పత్రాలు పంపిణీ పంపిణీ చేశారు. అందులో 47 మందికి రూ.29,01,784 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ముగ్గురికి రూ.11 లక్షల విలువైన ఎల్ వోసీ పత్రాలను అందించామన్నారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం అని , ఇప్పటివరకు నిడదవోలు నియోజకవర్గంలో సీఎం సహాయ నిధి క్రింద 344 మందికి రూ.2,84,48,563 మేర లబ్ధి చేకూర్చామని వెల్లడించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లకు మంత్రి దుర్గేష్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. పెరవలి మండల బాధితులు నిడదవోలుకు రావడం ఇబ్బందని గ్రహించి నేడు పెరవలి మండల కేంద్రంలో చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించామన్నారు.ఇకపై సీఎంఆర్ఎఫ్ చెక్కులు క్యాంపు కార్యాలయం ద్వారా కాకుండా ఉండ్రాజవరం, నిడదవోలు, పెరవలి సహా ఒక్కో మండలంలో ఒక్కోసారి నిర్వహిస్తామన్నారు. సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందుకున్న అనంతరం బాధిత లబ్ధిదారులు సీఎం చంద్రబాబునాయుడుకు, మంత్రి కందుల దుర్గేష్ కు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ ఆపన్నులకు హస్తం అందించేందుకు కూటమి ప్రభుత్వం సీఎం సహాయనిధి ద్వారా నిరంతరం ఆర్థికసాయం అందిస్తుందని అన్నారు.గతంలో ఈ స్థాయిలో ముఖ్యమంత్రి సహాయనిధి నుండి ఆర్థికసాయం అందిన దాఖలాలు లేవన్నారు. అరకొరగా మాత్రమే సాయం అందేది అన్నారు. ఇకపై ఎవరైనా సమస్యతో వస్తే తాను నేరుగా వారి సమక్షంలోనే అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. రాజకీయ పరమైన విబేధాలున్నప్పటికీ ఏ పార్టీ వారైనా ఆపద ఉందని వస్తే కుల,మత, ప్రాంత, పార్టీ, వర్గాలకతీతంగా సాయం చేస్తామన్నారు. కొన్ని సందర్భాల్లో మానవతాదృక్పథంతో వ్యవహరిస్తామే తప్ప రాజకీయ పరమైన విషయంలో తగ్గేదే లేదన్నారు. దీపం-2 పథకం, ఇంటి వద్దకే బియ్యం, పెన్షన్ల పంపిణీ అంశాల్లో సలహాలు, సూచనల కోసం అధికారులతో సమన్వయం చేసుకునేలా కార్యాచరణ రూపొందించామని అన్నారు. పెన్షన్లలో కోత ఉంటే సరిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పొరపాటున అర్హులు ఎవరికైనా పెన్షన్లు రద్దయితే తిరిగి దరఖాస్తు చేసుకుంటే అందిస్తామన్నారు. రేషన్ కార్డుల సమస్యలు సరిచేస్తున్నామన్నారు. ఏ ప్రభుత్వ లబ్ధి అయినా ఒక్కోసారి లేట్ అయినా ఇవ్వడం మాత్రం పక్కా అని భరోసానిచ్చారు.
నిడదవోలు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నామని ఈ క్రమంలో నిరంతర కృషి చేస్తున్నామని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా నియోజకవర్గ ప్రజలకు తాను నిత్యం అందుబాటులో ఉంటానని తెలిపారు. గత ప్రభుత్వం రోడ్లను పట్టించుకోలేదని, కనీసం తట్టెడు మట్టి వేయలేదన్నారు. ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, డ్రెయిన్లు నిర్మిస్తామన్నారు. నిధులు అందుబాటులో ఉన్నాయని, టెండర్లు ఖరారు అయిన వెంటనే రోడ్ల నిర్మాణం ప్రారంభిస్తామన్నారు. పెరవలి నుండి నిడదవోలు వచ్చే ఆర్ అండ్ బి రహదారిపై గుంతల రహిత ఏపీ కార్యక్రమంలో భాగంగా మరమ్మతులు చేపట్టామన్నారు. కానూరు నుండి ఉసులుమర్రు రోడ్డును సీసీ రోడ్డుగా చేయడానికి రూ.3 కోట్లు నిధులు మంజూరు చేయించానన్నారు.వర్షాలు తగ్గిన వెంటనే పెరవలి నుండి నిడదవోలు వెళ్లేందుకు ఏ రకమైన ఇబ్బందులు లేకుండా నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి దుర్గేష్ ఉద్ఘాటించారు.పీఎం నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల నేతృత్వంలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమగ్రాభివృద్ధి చెందుతున్నాయని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు.


