పెరవలి మండల తహశీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్
పీజీఆర్ఎస్ వచ్చిన అర్జీలు పెండింగ్ లో లేకుండా నిర్ణీత కాల వ్యవధి లోనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ
- అర్జీలు తీసుకుని సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేసిన మంత్రి
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ప్రతి అర్జీని పరిశీలించి అర్జీదారునికి పూర్తి స్థాయి న్యాయం చేయాలన్న మంత్రి దుర్గేష్
నిడదవోలు/పెరవలి: ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాధాన్యం అని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. సోమవారం నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండల తహశీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులు స్వీకరించారు. ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా విన్నారు. పీజీఆర్ఎస్ వచ్చిన అర్జీలు పెండింగ్ లో లేకుండా నిర్ణీత కాల వ్యవధి లోనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు.అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించకుండా ప్రజల నుంచి వివిధ సమస్యలపై స్వీకరించిన అర్జీలను ఎప్పటి కపుడు పరిశీలించి, సకాలంలో నాణ్యమైన పరిష్కారాన్ని చూపాలన్నారు. .రాష్ట్ర ప్రభుత్వం పీజిఆర్ఎస్ కు అధిక ప్రాధాన్యతను ఇస్తుందన్నారు. సమస్యపై తీసుకున్న చర్యలతో అర్జీదారుడు సంతృప్తి చెందాలని, అర్జీ మరలా రీ ఓపెన్ అయ్యే పరిస్థితి ఉండరాదన్నారు. ఈ సందర్భంగా పలువురు అధికారులతో మంత్రి దుర్గేష్ నేరుగా ఫోన్ కాల్ లో మాట్లాడారు.ప్రతి పౌరుడి అండతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ తెలిపారు. ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా చేపడుతున్న ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదికలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. మంత్రి దుర్గేష్ స్పందించిన తీరుపై పౌరులు ఆనందం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ ప్రియా సౌజన్య, పెరవలి తహశీల్దార్ కే. నిరంజన్, ఎంపీడీవో కే. ఉమా రాజ్యలక్ష్మీ పద్మజ, ఏవో గంటా శ్రీనివాస్, సీనియర్ అసిస్టెంట్ శంకర్, ఏపిఎం రామకృష్ణ, ఈఓఆర్డి సిహెచ్ వెంకటరమణ, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.


