సమాజానికి ఉపాధ్యాయులు మార్గదర్శకులు

:- రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్

మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం

పెరవలి మండలంలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 5 గురు ఉపాధ్యాయులకు ఘన సత్కారం

విద్యార్థుల భావి భవిష్యత్ కు మరింత తోడ్పాటు అందించాలని మంత్రి సూచన

నిడదవోలు/పెరవలి: మెరుగైన సమాజాన్ని సృష్టించడంలో కీలక పాత్ర పోషించేది గురువు అని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఒక గొప్పతరం తయారు కావాలంటే అది గురువు వల్లే సాధ్యం అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పెరవలి మండలంలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన కండిబోయిన ఉమ, జె. బాలకృష్ణకుమార్, కల్లూరి దుర్గాదేవి, పి. రవికుమార్, పెదప్రోలు నాగసత్య శ్రీనివాస కుమార్ లను సోమవారం మంత్రి కందుల దుర్గేష్ ఘనంగా సత్కరించారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక కావడం మండలానికి గర్వకారణం అన్నారు.ఇలాగే విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్ది రానున్న రోజుల్లో మరెన్నో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపిక కావాలని మంత్రి దుర్గేష్ ఆకాంక్షించారు. ఏ స్థాయిలో ఉన్నవారైనా తమకు చిన్నతనంలో చదువు చెప్పిన గురువులను గుర్తుంచుకుంటారని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. ఏ రంగంలో రాణించిన వారైనా ఒక గురువు వద్ద పాఠాలు నేర్చుకున్నవారే అని, గురువు అందించిన విజ్ఞానంతో, ప్రోత్సాహంతో, స్ఫూర్తితోనే ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ గుర్తుచేశారు.

Scroll to Top
Share via
Copy link