సుజాత జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే రాధాకృష్ణ
స్వర్ణ లయన్స్క్లబ్, మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్న చిట్టూరి సుజాత సేవాదృక్ఫథాన్ని ప్రతిఒక్కరు స్ఫూర్తిగా తీసుకోవాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. ప్రముఖ సామాజికవేత్త చిట్టూరి సుజాత జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొని మాట్లాడారు. ఎంతో మంది విద్యార్థులకు విద్యాసామాగ్రి అందజేయడంతోపాటు చిరువ్యాపారులకు అండగా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్న సుజాత మానవత సేవా సంస్థకు రూ. 3 లక్షలు అందజేయడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో తణుకు ప్రాంతంలో మరిన్ని సేవా కార్యక్రమాలు విస్తృతం చేయాలని ఎమ్మెల్యే రాధాకృష్ణ కోరారు. ఈ కార్యక్రమంలో స్వర్ణ లయన్స్ క్లబ్, మానవత స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


