అత్తిలి మండలంలోని పాలూరు గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ అధికంగా యూరియా వినియోగాన్ని తగ్గించాలని సిఫారసు మేరకు మాత్రమే యూరియా వినియోగించాలని అలాగే నానో యూరియా వినియోగించాలని తద్వారా నూటికి నూరు శాతం నత్రజని ఆకుల ద్వారా వరిపంట తీసుకుంటుందని తెలియజేశారు. అలాగే అక్కడక్కడ బ్యాక్టీరియా ఆకు ఎండతెగులు లక్షణాలు కనిపిస్తున్నాయని దాని నివారణకు ప్లాంటమైసిన్ లేదా కాపర్ హైడ్రాక్సైడ్ తెగులు మందులు వినియోగించి పిచికారి చేయాలని రైతులకు సూచించడం అలాగే బ్యాక్టీరియా ఆఫ్ తెగులు సోకిన పొలంలో నీరు తీసివేసి 48 గంటల తర్వాత 15 Kg la పొటాష్ ఎరువు వేసి నీరు పెట్టాలని అలాగే యూరియా వినియోగాన్ని పూర్తిగా నిలిపివేయాలని సూచించడమైనది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి రాజేష్, పిఎసిఎస్ ప్రెసిడెంట్ ధనరాజు, గ్రామ వైస్ ప్రెసిడెంట్ రాపేటి సింహాచలం, కూటమి నాయకులు, రైతులు పాల్గొన్నారు.


