అత్తిలిలో వైద్య శిబిరం ప్రారంభించిన ఎమ్మెల్యే

అత్తిలి మార్కెట్ కమిటీ చైర్మన్, జనసేన పార్టీ అత్తిలి మండలం అధ్యక్షుడు దాసం ప్రసాద్ ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన మెగా ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రారంభించారు. అత్తిలి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఏర్పాటుచేసిన పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ముందుగా కేకు కట్ చేసి ఎమ్మెల్యే మాట్లాడుతూ సామాజిక బాధ్యతతో పవన్ కళ్యాణ్ ఆదర్శంగా తీసుకొని దాసం ప్రసాద్ చేస్తున్న సేవా కార్యక్రమాలను ఎమ్మెల్యే రాధాకృష్ణ కొనయాడారు. ఉచితంగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేసి అత్యవసరమైన వారికి శస్త్ర చికిత్సలు చేయడానికి ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

నియోజకవర్గ వ్యాప్తంగా ఎమ్మెల్యే పర్యటన

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని తణుకు నియోజకవర్గంలో తణుకు, ఇరగవరం, అత్తిలి మండలాల పరిధిలో మంగళవారం నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొని కేకు కట్ చేశారు. తణుకు మండలం దువ్వ గ్రామంలో కేకు కట్ చేసిన అనంతరం పైడిపర్రులో పేదలకు నిత్యావసర వస్తువులను అందజేశారు. వెంకటేశ్వర థియేటర్ సెంటర్ వద్ద కేకు కటింగ్ చేసిన ఎమ్మెల్యే పాతఊరు కొమ్మాయి చెరువు గట్టు వద్ద పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. ఇరగవరం మండలం అర్జునుడుపాలెం, కొత్తపాడు గ్రామాల్లో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలకు హాజరయ్యారు. మధ్యాహ్నం ఇరగవరం గ్రామంలో పవన్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఆయన సాయంత్రం తణుకు సజ్జాపురం ఆండర్ పాస్ వద్ద కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. తేతలి,వేల్పూరు, కొమరవరం గ్రామాల్లో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొన్నారు…

Scroll to Top
Share via
Copy link