అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన నిలిచిన నాయకుడు
పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే రాధాకృష్ణ
అత్తిలిలో వైద్య శిబిరం ప్రారంభించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ
అధికారం ఉన్నా లేకపోయినా ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో తెలుగు రాష్ట్రాల్లో కోట్లాదిమంది అభిమానుల ఆరాధ్య దైవంగా పవర్ స్టార్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిలిచారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడేందుకు పవన్ కళ్యాణ్ కీలకంగా వ్యవహరించారని గుర్తు చేశారు. తణుకు నినియోజకవర్గ కూటమి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు.తొలుత తణుకు కూటమి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేకు కట్ చేసే వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ అటు సినిమా రంగంలో ఎంతోమంది ప్రేక్షకుల ఆదరణ పొందిన పవన్ కళ్యాణ్ మరోవైపు రాజకీయంగా, సేవారంగంలో తనదంటూ ప్రత్యేకతను చాటుకున్నారని అన్నారు.
రాజకీయ, సేవారంగంలో అధికారంతో నిమిత్తం లేకుండా ప్రతిపక్షంలో సైతం ప్రజల అవసరాలను గుర్తించి వారి పక్షాన నిలిచారని అన్నారు. జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ అధికారంలో లేకపోయినా ఎంతోమందికి అండగా నిలిచారని గుర్తు చేశారు. ప్రతిపక్షంలో ఉంటూ కౌలు రైతులకు నిధులు కేటాయించడంలో, ప్రత్యేక అవసరాలు ఉన్నవారికి అండగా నిలిచారని అన్నారు. ఆనాడు చంద్రబాబు నాయుడుని అక్రమంగా 53 రోజులపాటు జైలులో పెట్టినప్పుడు ముందుగా వచ్చి తన సంఘీభావాన్ని తెలియజేసి కూటమి నాయకత్వంలో ఎన్నికలకు వెళ్లాలని పవన్ కళ్యాణ్ ప్రకటించి తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో మనోధైర్యాన్ని నింపారని అన్నారు.


