ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు దివంగత మహానేత డాక్టర్ వై.యస్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా….
నిడదవోలు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో దివంగత మహానేత డాక్టర్ వై.యస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన నిడదవోలు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు జి.శ్రీనివాస్ నాయుడు. అనంతరం నిడదవోలు పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అన్నదానం రొట్టెలు, పండ్లు అందజేయడం జరిగింది. నిడదవోలు పట్టణ వై.యస్.ఆర్ కాలనీలో దివంగత మహానేత డాక్టర్ వై.యస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి, నిడదవోలు పట్టణ బసిరెడ్డిపేటలో దివంగత మహానేత డాక్టర్ వై.యస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు ఈ కార్యక్రమాలకి పట్టణ మండల అధ్యక్షులు, కౌన్సిలర్లు, వైఎస్ఆర్సిపి , కార్యకర్తలు వివిధ గ్రామాల నాయకులు అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.


