ఇంటెన్సీ ఫైడ్ టీబీ ముక్తభారత్ అభయాన్ కార్యక్రమం..
ఉండ్రాజవరం మండలం
వడ్లూరు గ్రామంలో శుక్రవారం ఇంటెన్సీ పైడ్ టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు,
ఈ కార్యక్రమంలో క్షయవ్యాధిగ్రస్తులు చికిత్సతో పాటు గా పోషకాహారం తీసుకోవాలన్నారు. వ్యాధిగ్రస్తులు కుటుంబసభ్యులతో మెలిగినప్పుడు తగుజాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్. ఆర్. ఉషాదేవి సూచించారు ,
అనంతరం ప్రధానమంత్రి టీ.బి. ముక్త భారత్ కార్యక్రమంలో భాగంగా వడ్లూరు ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం నందు క్షయ వ్యాధిగ్రస్తులకు 20 మందికి పోషకాహారం కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ జి ఆశాజ్యోతి మాట్లాడుతూ
ఈ వ్యాధిగ్రస్తులను దత్తత తీసుకున్న శ్రీ సర్వరాయ షుగర్ లిమిటెడ్ ప్రతినిధి
హెచ్ ఆర్ శ్రీధర్ ను అభినందించారు,
ప్రతి ఒక్కరికి క్షయ వ్యాధి పట్ల అవగాహన కలిగి ఉండాలని తెలియజేశారు. టీ.బి. సోకిన వారికి చికిత్స కాలం 6 నెలలు పాటు క్రమం తప్పకుండా మందులు వాడాలి అని సూచించారు
ప్రభుత్వం పోషకాహారం నిమిత్తం వ్యాధిగ్రస్తులకు మందులు వాడుతున్నంతకాలం, ప్రతి నెల వెయ్యి రూపాయలు చొప్పున నేరుగా వారి బ్యాంకు ఖాతా లోనికి జమ అవుతాయని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో
గ్రామ టిడిపి నాయకులు
పెనుమచ్చ వెంకటేశ్వర్రావు,
వేములమంద సీతారామరాజు సొసైటీ ప్రెసిడెంట్,
వైద్య సిబ్బంది
ఎంపీహెచ్ఎస్ ఏ శ్రీరామ్మూర్తి,
ఎంపీహెచ్ఏ యు.రాము,
ఎమ్మెల్ హెచ్ పి కే. వెంకటలక్ష్మి ,
ఏఎన్ఎం డి.సూర్యకుమారి
మరియు ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.


