ప్రజల నుండి ప్రభుత్వం ఆదానికి దోచిపెడుతుంది – సిపిఎం వేల్పూరు

విద్యుత్ రంగంలో స్మార్ట్ మీటర్లు. ట్రూ ఆప్ చార్జీల పేరుతో ప్రజల నుండి ప్రభుత్వం ఆదానికి దోసి పెడుతుందని సిపిఎం వేల్పూరు గ్రామ కార్యదర్శి బళ్ళ చిన వీరభద్రరావు విమర్శించారు. సిపిఎం ఆధ్వర్యంలో విద్యుత్ పోరాటంలో అమరులైన సత్తెనపల్లి రామకృష్ణ. విష్ణువర్ధన్ రెడ్డి. బాలస్వామి చిత్రపటాలకు పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వీరభద్ర రావు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఆదేశాలతో గత వైసీపీ ప్రభుత్వం రూ.1750 కోట్లు లంచాలు తీసుకుని ఆదాని సంస్థతో సోలార్ విద్యుత్తు ఒప్పందాలు చేసుకుందని అమెరికాలో ఇండెన్ బర్క్ అనే పత్రిక బట్టబయలు చేయడంతో పాటు అమెరికా కోర్టులో కేసు వేసిన విషయాన్ని వీరభద్రరావు గుర్తు చేశారు. మరి ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ బాదుడే – బాదుడు అని ప్రసారం చేయడం తో పాటు స్మార్ట్ మీటర్లు బిగించడానికి మీ ఇంటికి వస్తే మీటర్లను బద్దలు కొట్టండి మీకు తెలుగుదేశం అండగా ఉంటుంది అని చెప్పిన లోకేష్ నేడు అధికారంలోకి వచ్చాక ప్రతి ఇంటికి స్మార్ట్ మీటర్లు బిగించాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం సిగ్గుచేటు అని ఆయన విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న స్మార్ట్ మీటర్లు. ట్రూ ఆఫ్ చార్జీలు పేద సామాన్య మధ్యతరగతి ప్రజలు మరింత దోపిడీకి గురవుతున్నారని చిన్న మధ్య తరగతి వ్యాపారులు. పరిశ్రమల వారు ఈ బారానికి గురికాక తప్పడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణలపై సాగిస్తున్న ఉద్యమ పోరాటాన్ని అమరవీరులకు మనం అందించే ఘనమైన నివాళి అని ఆయన పేర్కొన్నారు. అమరవీరుల స్ఫూర్తితో ప్రతిజ్ఞ దినం పాటించారు. ఈ కార్యక్రమంలో శాఖ కార్యదర్శి వాసా వెంకటేశ్వరావు. యండమూరి నాగేంద్ర. విశ్వనాథం సుబ్బారావు. కరేళ్ళ అర్జున్. తాళ్ల సత్యనారాయణ. పోలవరపు రంగారావు. వాసా పోసియ్య. అయిశెట్టి సత్యనారాయణ. బొక్క మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link