విద్యుత్ ఉద్యమంలో మృతి చెందిన వారి ఆశయాలను అమలు చేస్తామని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గురువారంనాడు ఇరగవరం మండల కేంద్రంలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ప్రతిజ్ఞను చేసినారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కన్వీనర్ కామన మునిస్వామి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రాలుగా ఉన్నప్పుడు నిర్వహించిన విద్యుత్ ఉద్యమంలో మృతి చెందిన విష్ణువర్ధన రెడ్డి మరో ఇద్దరికి నివాళులర్పిస్తూ నివాళులర్పిస్తున్నామని అన్నారు. నేడు కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత 17 వేల కోట్ల రూపాయలు విద్యుత్తు భారాన్ని ప్రజలపై వేశారని అన్నారు. ఎన్నికల ముందు కూటమి నాయకులు ప్రజలపై విద్యుత్తు భారాలు వేయమని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ భారాలు వేశారని అన్యాయం అన్నారు. సామాన్యులు ,మధ్యతరగతి ప్రజలపై స్మార్ట్ మీటర్లు, ట్రూ ఆఫ్ చార్జింగ్ పేరుతో వేలకోట్ల రూపాయలు భారాలు వేస్తున్నారని వీటిని వెంటనే నిలుపుదల చేయకపోతే ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఉద్యమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిల్లి కోటేశ్వరరావు, పేచ్చేటి నాగేశ్వరరావు పిల్లి ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.


