వినాయకచవితి ఉత్సవాల్లో భారీ అన్నదానం

శ్రీ వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా విఘ్నేశ్వరుని విశేష పూజాది కార్యక్రమాలు, గొప్ప అన్నదానం

కార్యక్రమం లో పాల్గొన్న 29వ వార్డ్ జనసేన నాయకులు మన్యాల శ్రీనివాస్

విశాఖపట్నం: ఆగస్టు 29 (కోస్టల్ న్యూస్)

29వ వార్డ్ ఆంథోనీ నగర్ యూత్ మరియు మహిళలు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ విఘ్నేశ్వరుని ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న మన్యాల శ్రీనివాస్ అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు ముందుగా మన్యాల శ్రీనివాస్ కి కమిటీ సభ్యులు, మహిళలు సాదర స్వాగతం పలికి స్వామి వారికి విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించి అనంతరం తీర్థ ప్రసాదాలను అందజేశారు అనంతరం శాలువాతో సత్కరించారు. మన్యాల శ్రీనివాస్ మాట్లాడుతూ స్వామి వారి విశేష పూజ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు చాలా సంతోషంగా వుంది అని ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా పాల్గొనటం చాలా ఆనందంగా ఉంది అని అన్ని దానాలలో కెల్లా అన్నదానం చాలా శ్రేష్టమైనదని, భక్తులందరికీ తన చేతుల మీదుగా అన్నదానం వితరణ చేయించడం చాలా ఆనందంగా ఉంది అని, ఆంథోనీ నగర్ ప్రాంత ప్రజలు ఎలాంటి కార్యక్రమం చేపట్టిన తన సహాయ సహకారాలు ఉంటుంది అని తెలిపారు. కమిటీ సభ్యులు మరియు మహిళలు మాట్లాడుతూ మన్యాల శ్రీనివాస్ అంటే మాకు ఒక నమ్మకం ఒక భరోసా అని మేము ఏ కార్యక్రమం తలపెట్టిన ముందుండి ప్రోత్సహిస్తారు. అని మన్యాల శ్రీనివాస్ పై ఆ భగవంతుని కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు యువత మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link