విజయవాడలోని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్, కళాయజ్ఞ వారు ఆదివారం నిర్వహించిన
“శ్రమైక జీవన సౌందర్యం” అనే అంశంతో
రాష్ట్ర స్థాయి చిత్రకళా ప్రదర్శన మరియు వర్తమాన పరిస్థితుల్లో చిత్రకారుడి పాత్ర
పై సెమినార్ లో తణుకు కు చెందిన ప్రముఖ చిత్రకారుడు డాక్టర్ వెంపటాపు చిత్రించిన
ఉడ్ డిజైనర్ చిత్రం పలువురి ప్రశంసలు అందుకుంది
రాష్ట్రస్థాయిలో 40 కి పైగా చిత్రకారులు పాల్గొని శ్రామికుల్ని వారి శ్రమ ని హృద్యంగా చిత్రాలు మలిచి ప్రదర్శించారని వెంపటాపు తెలిపారు
ఈనాడు కార్టూనిస్ట్ శ్రీధర్,
ఎస్వీ యూనివర్సిటీ అధ్యాపకులు డాక్టర్ సాగర్ గిన్నె,
యోగివేమన యూనివర్సిటీ హెచ్ ఓ డి డాక్టర్ మృత్యుంజయరావు,
కళాయజ్ఞ ఏలూరి శేష బ్రహ్మం, చిత్రకళావధాన్ డాక్టర్ ఉదయ్ కుమార్ లు
వెంపటాపు ను అభినందించి ఘనంగా సన్మానించారు
ఈ సందర్బంగా వెంపటాపు ను స్వగ్రామం ఇరగవరం ప్రముఖులు
తణుకు పట్టణ ప్రముఖులు అభినందించారు.


