రాష్ట్రంలోనే జిల్లాకు తెలుగుదేశం కంచుకోట
తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ
తెలుగుదేశం పార్టీ త్రిసభ్య కమిటీ సమావేశం : నిబద్ధత, విశ్వాసం కలిగిన కార్యకర్తలు ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమేనని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ త్రిసభ్య కమిటీ సమావేశం ఆదివారం భీమవరంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హాజరైన ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ పార్టీ ఏ క్రమం ఆదిశించినా పశ్చిమ గోదావరి జిల్లా ముందుండి కార్యక్రమాలను విజయవంతం చేయడంలో జిల్లా నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. గత ఎన్నికల్లో సైతం అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించారని అన్నారు. గతం నుంచి తెలుగుదేశం పార్టీకు పశ్చిమ గోదావరి జిల్లా కంచు కోటగా నిలుస్తుందన్నారు. సమష్టి నిర్ణయాలతో జిల్లాను రాష్ట్రంలోనే ప్రత్యేక స్థానంలో నిలిపినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్లకు జిల్లా అంటే ఒక ప్రత్యేక అభిమానం ఉందన్నారు. గత ప్రభుత్వంలో దుర్మార్గంగా, అన్యాయంగా చంద్రబాబును జైలులో పెడితే జిల్లా వ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని గుర్తు చేశారు. ఆనాడు వైఎస్సార్ సీపీ చేసిన అక్రమాలు, అన్యాయాలను వెలికితీసి ఎన్నో పోరాటాలు చేస్తే అక్రమ కేసులు బనాయించారని అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులతోపాటు ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


