తణుకు పట్టణ కమిటీ ఎన్నికల్లో ఎమ్మెల్యే రాధాకృష్ణ
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిని అధికారంలోకి తీసుకురావడానికి కిందిస్థాయి నుంచి కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ తణుకు పట్టణ వార్డు కమిటీల ఎన్నిక ప్రక్రియ కొనసాగుతోంది. గురువారం తణుకులోని 2, 11 వార్డులకు సంబంధించి నూతన కమిటీలను ప్రకటించారు. స్థానిక ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల్లో 2వ వార్డు అధ్యక్షుడిగా నక్కా ఈశ్వర ప్రసాద్, ఉపాధ్యక్షుడిగా షేక్ మస్తాన్ భాషా, ప్రధాన కార్యదర్శిగా రామదాసు త్రిమూర్తులు, కోశాధికారిగా ఏడిద శ్రీలక్ష్మి, కార్యనిర్వాహక కార్యదర్శిగా కోరాడ సాయికుమార్, బొంద శ్రీదుర్గా వాత్సల్య, మద్దుల సత్య వెంకటాచలం, కార్యదర్శులుగా చిక్కనీడి దుర్గారావు, దత్తు ధనలక్ష్మి, రాగిడిమిల్లి దుర్గాబాబు ఎన్నికయ్యారు. 11వ వార్డు అధ్యక్షుడిగా మద్దినపూడి రామకృష్ణ శివరావు, ఉపాధ్యక్షుడిగా బొద్దాని అమ్ములు, ప్రధాన కార్యదర్శిగా కోళ్ల ఆనందరావు, కోశాధికారిగా ముత్యాల వాణి లక్ష్మీ సత్యవతి, కార్యనిర్వాహక కార్యదర్శిగా దేవరకొండ మురళీకృష్ణ, అడపా నాగేశ్వరరావు, పీతల సత్యవతి, కార్యదర్శులుగా మురమళ్ళ సత్తిరాజు, ఎనిపెల్లి కొండయ్య, భత్తుల సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరంతా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మరోసారి కూటమిని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేయాలని ఎమ్మెల్యే రాధాకృష్ణ కోరారు.


