నిడదవోలులో పలు అభివృద్ధి పనులకు మంత్రి కందుల దుర్గేష్ శంకుస్థాపన

రూ.44.17 లక్షల అంచనా వ్యయంతో కోరుమామిడిలో మంచినీటి ట్యాంక్, పైప్ లైన్లు, కుళాయిలు ప్రారంభించిన మంత్రి దుర్గేష్

తీరుగూడెంలో నూతనంగా నిర్మించిన 33/11 కే.వి. టిడ్కో విద్యుత్ ఉప కేంద్రం ప్రారంభోత్సవం

రూ. 68.50 లక్షల ఎంఎన్ఆర్జీఎస్ నిధులతో నిర్మిస్తోన్న “పంచాయతీరాజ్ రోడ్డు” ప్రారంభోత్సవం..నూతన రోడ్లకు శంకుస్థాపన

నిడదవోలు మున్సిపాలిటీ పరిధిలో స్టారమ్ వాటర్ డ్రైన్లు నిర్మాణ పనులను ప్రారంభించిన మంత్రి దుర్గేష్

త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం

నిడదవోలు నియోజకవర్గంలో మంత్రి కందుల దుర్గేష్ సుడిగాలి పర్యటనలు చేసి పలు గ్రామాల్లో పదుల సంఖ్యలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అందులో భాగంగా బుధవారం నిడదవోలు రూరల్ మండలం కోరుమామిడి గ్రామంలో జల్ జీవన్ మిషన్ ద్వారా రూ.44.17 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన మంచినీటి ట్యాంక్, పైప్ లైన్లు, కుళాయిలను మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించి దాని ప్రాముఖ్యతను వివరించారు.

అనంతరం తీరుగూడెంలో ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఏపీ టిడ్కో నిధులతో నూతనంగా నిర్మించిన 33/11 కే.వి. టిడ్కో విద్యుత్ ఉప కేంద్రం ప్రారంభోత్సవంలో మంత్రి దుర్గేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రాన్స్ కో వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సబ్ స్టేషన్ ద్వారా నిడదవోలులోని కొంత భాగంతో పాటు ఆంజనేయపురం, సింగవరం, తీరుగూడెం ప్రాంతాలకు నిరంతరాయంగా కరెంట్ ఇచ్చే అవకాశం ఉందన్నారు. స్థానికంగా టిడ్కో ఇళ్లు పూర్తయితే వాటికి ఉపయోగకరంగా ఉంటుందన్నారు. 3 ఫేజ్ కరెంట్ ఇవ్వడం ద్వారా ఇబ్బందులుండవన్నారు. గృహాలకు కరెంట్ తో పాటు చిన్న పరిశ్రమల ఏర్పాటుకు ఉపయోగపడుతుందన్నారు. ఔత్సాహికుల పారిశ్రామిక వేత్తలకు ఇదొక మంచి అవకాశం అని తెలిపారు. ఇదొక సాంకేతిక విప్లవంగా అభివర్ణించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్, క్వాంటం కంప్యూటింగ్ తదితర సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన అనేక పనులు నిర్వహిస్తున్నారన్నారు. విద్యుత్ సంస్కరణ తీసుకొచ్చారన్నారు. 365 రోజులు ఎండ ఉండే ప్రాంతాలు కావడంతో కేంద్రం అందిస్తున్న సూర్యఘర్ పథకం ద్వారా విద్యుత్ అవసరాలు తీర్చుకునేందుకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. తద్వారా ఆర్థికంగా ఆదాతో పాటు ఆరోగ్యంగా ఉంటామన్నారు. గత ప్రభుత్వం టిడ్కో ఇళ్ల విషయంలో నిర్లక్ష్యం వహించడంతో లబ్ధిదారులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. త్వరితగతిన ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. తద్వారా ఆయా ఇళ్లకు విద్యుత్ దీని ద్వారా అందుతుందన్నారు. అతి తక్కువ ఖర్చుతో కూడుకున్న సూర్య ఘర్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ అమలు చేయాలన్నారు. మనమే కరెంట్ అమ్ముకునే అవకాశం ఉంటుందన్నారు.

అంతకుముందు పెరవలి మండలం ఖండవల్లి గ్రామం నందు రూ. 68.50 లక్షల అంచనా వ్యయంతో ఎంఎన్ఆర్జీఎస్ నిధులతో నిర్మిస్తోన్న “పంచాయతీరాజ్ రోడ్డు” ప్రారంభోత్సవంతో పాటు మరో నూతన రోడ్డు నిర్మాణనికి మంత్రి దుర్గేష్ శంకుస్థాపన చేసారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి తేడాను వివరించారు.

15వ ఆర్థిక సంఘం మరియు మున్సిపల్ సాధారణ నిధులకు సంబంధించి రూ.33.40 లక్షల అంచనా వ్యయంతో నిడదవోలు పురపాలక సంఘ పరిధిలో గల 27వ వార్డు నుండి పంగిడి రోడ్డు పడమరవైపు డాక్టర్ ప్రసాద్ హాస్పిటల్ రోడ్డు నుండి 28వ వార్డునేతాజీ రోడ్డు వరకు చేపట్టిన స్టారమ్ వాటర్ డ్రైన్లు నిర్మాణ పనులను మంత్రి దుర్గేష్ ప్రారంభించారు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలిని ఆదేశించారు.

కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ తో పాటు స్కిల్ డెవలప్ మెంట్ ఛైర్మన్ బూరుగుపల్లి శేషారావు, మున్సిపల్ ఛైర్మన్ భూపతి ఆదినారాయణ, అధికారులు, సిబ్బంది, కూటమి నేతలు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link