నియోజకవర్గంలో పలుఅభివృద్ధి పనులకు శ్రీకారం
విజయవంతం చేయాలని ఎమ్మెల్యే రాధాకృష్ణ పిలుపు
తణుకు నియోజకవర్గంలో ఈ నెల 10న రాష్ట్రమంత్రులు పర్యటించనున్నట్లు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, జిల్లా ఇన్ చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్, రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులుశాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, కేంద్ర భారీపరిశ్రమలశాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ హాజరవుతారని చెప్పారు. తణుకు పట్టణంలోని 25, 29, 34, 28, 12, 13 వార్డులతో పాటు ఇరగవరం మండలం కె.ఇల్లందలపర్రు, ఏలేటిపాడు, ఆయనపర్రు, తణుకు మండలం వేల్పూరు గ్రామాల్లో పలుఅభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని వివరించారు. ఆయా కార్యక్రమాల్లో తణుకు నియోజకవర్గంలోని కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొని మంత్రుల పర్యటన విజయవంతం చేయాలని ఎమ్మెల్యే రాధాకృష్ణ కోరారు.


