జగన్ ప్రభుత్వం ఒక్క టీచర్ పోస్ట్ కూడా ఇవ్వలేదు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహించడం నిరుద్యోగుల జీవితాల్లో ఒక వరంగా భావించవచ్చు. డీఎస్సీలో అవకతవకలు జరిగాయని వైస్సార్సీపీ నాయకులు బురద జల్లటం ఎంతవరకు సమంజసం.. ఐదు సంవత్సరాల కాలంలో ఒక్క ఉపాధ్యాయ పోస్టులు కూడా ఇవ్వకుండా కాలయాపన చేసి, నిరుద్యోగులను మోసం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఒక వైసీపీ ప్రభుత్వం అని మాజీ జెడ్పిటిసి జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు చుక్కా సాయిబాబు అన్నారు. ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ అని చెప్పి అధికారంలోకి వచ్చి, ఒక్క ఏడాది కూడా జాబ్ క్యాలెండర్ వెయ్యని మోసకారి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో జరిగిన డీఎస్సీ నియామకాలు అవినీతికి తావు లేదన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 1 లక్ష 96 వేల ఉపాధ్యాయుని పోస్టులు ఇవ్వడం జరిగిందని. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఇటు నోటిఫికేషన్లు వేయక, అటు కంపెనీలను తరిమికొట్టే నిరుద్యోగులను నిలువునా జగన్ ముంచేసారని విమర్శించారు. ఈ సమావేశంలో మార్కెట్ డైరెక్టర్ కాసగాని రామకృష్ణ, సొసైటీ ప్రెసిడెంట్ కారెం బాబురావు,  ఏఎంసి మాజీ డైరెక్టర్ కాకర చిట్టి రాజు, మర పట్ల వీర్రాజు, తామరపల్లి రాజేష్, మాండ్రు వెంకటేశ్వరరావు, షేక్ మస్తాన్, శ్రీనివాసరావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు

Scroll to Top
Share via
Copy link