స్టీల్ ప్లాంట్ ప్రమాద క్షతగాత్రులను పరామర్శించిన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విశాఖపట్నం కిమ్స్ ఆసుపత్రిలో స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులు, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరుని అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు. ఆసుపత్రిలో అందుతున్న చికిత్సకి సంబంధించిన వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వైద్యానికి అయ్యే ఖర్చులు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని, అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ లు పవన్ కళ్యాణ్ వెంట ఉన్నారు.

Scroll to Top
Share via
Copy link