భారతదేశ ప్రధానిగా నరేంద్ర మోడీ 12 సంవత్సరాలు పూర్తి

భారతదేశ ప్రధానిగా నరేంద్ర మోడీ 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తణుకు పట్టణ బిజెపి అధ్యక్షులు బొల్లాడ నాగరాజు ఆధ్వర్యంలో తణుకులో శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలో పూజలు చేయడం జరిగిన ఆ స్వామివారి ఆశీస్సులు ప్రధానిపై ఉండాలని వారికి ఆయురారోగ్యాలు, శక్తిని ప్రసాదించాలని బిజేపి శ్రేణులు ప్రత్యేకపూజలు చేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొనడం జరిగినది. ఈ కార్యక్రమంలో డా. ముళ్ళపూడి రేణుక మాట్లాడుతూ భారత ప్రజాస్వామ్య చరిత్రలో సువర్ణ అధ్యాయం ప్రజల విశ్వాసంతో, నిరంతర సేవా సంకల్పంతో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ, భారతదేశంలో అత్యంత దీర్ఘకాలం నిరంతరంగా సేవలందించిన ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రధానమంత్రిగా నేడు నరేంద్ర మోడి చరిత్ర సృష్టించారని, సబ్కా సాథ్ – సబ్కా వికాస్ – సబ్కా విశ్వాస్ – సబ్కా ప్రయాస్ అనే మంత్రంతో దేశాన్ని ప్రతి రంగంలో ముందుకు తీసుకెళ్తూ, ప్రపంచవేదికపై భారత గౌరవాన్ని మరింత ఉన్నత స్థాయికి చేర్చిన దూరదృష్టి గల నాయకుడు నరేంద్ర మోడికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. “వికసిత భారత్ – 2047” లక్ష్య సాధనలో ప్రతి భారతీయుడు భాగస్వామి కావాలి అని బిజేపి రాష్ట్ర అధికార ప్రతినిధి ముళ్ళపూడి రేణుక కోరారు.

Scroll to Top
Share via
Copy link