పనిఒత్తిడి నుండి మమ్మల్ని కాపాడండి

ఉద్యోగుల ప్రాణాలు తీసుకుంటున్న పని ఒత్తిడి సంస్కృతిని వెంటనే అరికట్టి స్వర్ణ వార్డు సచివాలయం ఉద్యోగులప్రాణాలు కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఉండ్రాజవరం మండల వీఆర్వోల సంఘం ఆధ్వర్యంలో కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సచివాలయం వీఆర్వో గా పని చేస్తున్న షేక్ మహ్మద్ హుస్సేన్ బాషా అధికారుల వేధింపులు తాళలేక ఇంటిలో ఉరివేసుకుని ఆత్మ హత్యకు పాల్పడిన అత్యంత విషాదకర ఘటనను నిరసిస్తూ దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ బాధ్యులైన అధికారుల పై చర్యలు తీసుకోవాలని మృతిని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఉండ్రాజవరం తహసిల్దార్ కార్యాలయం వద్ద ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వీఆర్వోలు మాట్లాడుతూ విఆర్వో గా పని చేస్తున్న హుస్సేన్ ని అధికారులు తిరిగి వార్డు రెవెన్యూ కార్యదర్శిగా పని అప్పగించటంతో పాటు బిఎల్వో సర్వేలు అంటూ అదనపు బాధ్యతలు అప్పచెప్పటం మృతుడికి తీవ్రమైన వెన్నుముక నొప్పి సమస్యలు ఉన్నాయని నడవలేని స్థితిలో ఉన్నట్లుగా చెప్పినా కూడా అధికారులు ఎన్నికల విధి. కంప్యూటర్ సర్వేలు టార్గెట్లు అంటూ నాకు కంప్యూటర్ పరిజ్ఞానం తక్కువ కనీసం బిఎల్వో విధులనుంచి మినహాయించండి లేదా బదిలీ చెయ్యండి అని వేడుకున్న వినకుండా అధికారులు అదనపు బాధ్యతలు అప్పచెప్పటం ఆఖరికి మృతుడు తన చావుకి అధికారులే వేధింపులే కారణం అని సూసైడ్ నోట్ రాసి ఆత్మ హత్య చేసుకున్నారని ఉద్యోగి ప్రాణం తీసుకొనేంతగా మానసిక వేదన, విధుల ఒత్తిడి, ఉద్యోగభద్రతపై ఆందోళనలు ఉండటం ప్రభుత్వ వ్యవస్థ ఆత్మ పరిశీలన చేసుకోవాలని రెవిన్యూ ఉద్యోగులు ఆత్మహత్యలపై న్యాయపరమైన. ఉన్నత స్థాయి విచారణ జరపాలని విఆర్వోలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా హుస్సేన్ మృతికి రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ఉండ్రాజవరం మండల వీఆర్వో సంఘం గౌ.అధ్యక్షులు వెలిచేటి పాపారావు, వర్కింగ్ ప్రెసిడెంట్ అరిగెల చిట్టిబాబు, వీఆర్వోలు ఆర్.నాగలక్ష్మి, అప్పారావు, ఏసుపాదం, టి.శ్రీనివాసు, లక్ష్మి, పోలయ్య, డి.సొమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link