పాపికొండలకు వెళ్తున్న బోటులో సాంకేతిక లోపం

పోలవరం జిల్లాలోని పాపికొండల విహారయాత్రకు బయలుదేరి వెళ్లిన పర్యాటక బోటు.. సాంకేతికలోపం తలెత్తడంతో గోదావరిలో నిలిచిపోయింది.

దేవీపట్నం మండలం గండిపోశమ్మ అమ్మవారి ఆలయం నుంచి శుక్రవారం ఉదయం ఓ బోటులో దాదాపు 89 మంది పర్యాటకులు పాపికొండల విహారయాత్రకు బయలుదేరారు.

నదిలో దేవీపట్నం పాత పోలీసుస్టేషన్‌ ప్రాంతానికి వెళ్లే సరికి సాంకేతిక లోపం తలెత్తడంతో బోటును సరంగు (డ్రైవర్‌) నిలిపి వేశాడు. సమాచారాన్ని కంట్రోల్‌ రూం అధికారులకు చేరవేయడంతో వారు అప్రమత్తమయ్యారు.

బోటు పాయింట్‌ నుంచి వెంటనే జలశ్రీ బోటును పంపించి.. పర్యాటకులను దానిలోకి ఎక్కించి విహార యాత్రను కొనసాగించారు.

సమస్యపై జలవనరుల శాఖ ఏఈ భాస్కర్‌ను ‘మీడియా’ వివరణ కోరగా… ఇంజిన్‌కు సంబంధించిన సాఫ్ట్‌ బేరింగ్‌ బిగుతుగా అయిపోవడంతో ఇబ్బంది తలెత్తిందన్నారు.

దీంతో పర్యాటకులకు వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాటు చేశామని తెలిపారు. శుక్రవారం వెళ్లిన రెండు పర్యాటక బోట్లు సురక్షితంగా తిరిగి వచ్చాయని వివరించారు.

నిర్లక్ష్యం ఎవరిది :

ఫోటోలు కనిపిస్తున్న ప్రకారం పర్యాటకులకు లైఫ్ జాకెట్లు దాదాపు 7గురికి లేవు… మిగిలినవారి లైఫ్ జాకెట్ల విషయం అగమ్యగోచరం..

సిబ్బంది నిర్లక్ష్యమా..?

పర్యాటకలుదా..?

ప్రమాదం జరిగితే..??

గతంలో జరిగిన ప్రమాదాలు దృష్ట్యా..!!

89 మంది పర్యాటకులు..!!

ప్రమాదం జరిగితే మాత్రం… మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పర్యాటకులు కోరుతున్నారు.

Scroll to Top
Share via
Copy link