గత సంవత్సరము అక్టోబర్ నెలలో తణుకు పట్టణములో ఉండ్రాజవరం రోడ్డులో గల స్మశానాల దగ్గర 5 కేజీల గంజాయినీ రవాణా చేస్తూ పట్టుబడిన కేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడి మండపాక గ్రామానికి చెందిన పోలవరపు కుమార శివ (21) అనే వ్యక్తి నీ తణుకు ఎక్సైజ్ అధికారులు బుధవారము అరెస్టు చేయడం జరిగింది. ఒరిస్సాలో మల్కాన్గిరి నుండి గంజాయిని కేజీ రెండువేల చొప్పున కొనుగోలు చేసి తణుకు పట్టణ పరిసరాలలో కేజీ 3000 కి టోకుగా విక్రయించడం తో పాటు కొద్దికొద్ది మొత్తంలో లూజుగా కూడా విక్రయాలు జరుపుతున్నాడు. ఇతను ఇటీవల వరకు ద్విచక్ర వాహనాల చోరీకి అలవాటు పడ్డాడు. కృష్ణలంక, రాజమండ్రి, ఉంగుటూరు, మారేడుమిల్లి తదితర ప్రాంతాలలో వాహనాల చోరీకి పాల్పడ్డాడు, దానికి సంబంధించిన కేసులులో కూడా నిందితుడుగా ఉన్నాడు. పలు కేసుల్లో పరారీలో ఉన్నాడు. దీనిలో పెద్దగా లాభము రావడం లేదని గంజాయి అమ్మడం ద్వారా లాభాలు ఆర్జించవచ్చని భావించి ఒడిస్సా లో మల్కనగిర్ నుండి గంజాయి తెచ్చి తణుకు పరిసర ప్రాంతాలలో అమ్ముటకు ప్రయత్నించి పట్టుబడటం జరిగింది. గంజాయి కి సంబంధించి విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎస్. మణికంఠ రెడ్డి తెలిపారు. గంజాయి మరియు డ్రగ్స్ కి సంబంధించి సంబంధించి ఏమైనా సమాచారం ఉంటే 9490874538 నెంబర్ కు సమాచారం అందించగలరు.



