తణుకు పాతూరులో మే 31 రాత్రి ఘర్షణలో కత్తులు, బీరు సీసాలతో జరిగిన దాడిలో ఉందుర్తి ఎలీషా అలియాస్ (అబ్బులు) మరణించగా, అతని తమ్ముడు తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ హత్య కేసులో నలుగురు నిందితులు అరెస్ట్ కాగా ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో తాడేపల్లిగూడెం డిఎస్పి డి. విశ్వనాథ్ మాట్లాడుతూ పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ ఆదేశాలతో ఎవరైతే ఈ హత్య కేసులో నిందితులుగా ఉన్నారో వారి గురించి మూడు టీములు వేయడం జరిగిందని, ఉందుర్తి ఎలీషా అనే వ్యక్తికి తేతలి వై జంక్షన్ లో బిర్యాని షాప్ నడుపుతున్నాడని, మూడు నెలలకు క్రితం వీరికి మల్లిపూడి శశికుమార్ , గొడవ జరగడంతో గత మూడు నెలలుగా వీరి మధ్య చిన్న ఘర్షణలు ఏర్పడడంతో అతనిపై పగ పెంచుకుని, మే నెల 31 తారీకు రాత్రి 9 గంటల ప్రాంతంలో గొడవ పడినట్లు గొడవ సమయంలో మళ్లీపూడి ప్రదీప్, మల్లిపూడి శశి, లోకేశ్వరరావు, మరొక మైనర్ బాలుడు, కత్తితోను బీరు బాట్లతో ఉందుర్తి ఏలీషాను దాడి చేయడంతో అతనికి తీవ్రగాయాలై చనిపోవడం జరిగిందని అన్నారు. మృతుడి తమ్ముడు ఉందుర్తి చిన్న ఫిర్యాదుతో కేసు నమోదు కే నమోదుచేసి నిందితులు మల్లిపూడి ప్రదీప్, మల్లిపూడి శశి, లోకేశ్వరరావు, ఓ మైనర్ బాలుడు దీనికి సంబంధించి తణుకు టౌన్ పోలీసులు, రూరల్ పోలీసులు వారిని అరెస్టు చేసి కోర్టు ముందు హాజరు పరిచామని డీఎస్పీ వెల్లడించారు.
ఈ కేసు విషయంలో 15 మంది పోలీసులు పాల్గొన్నారని త్వరితగతిన కేసు ఛేదించిన పోలీసు అధికారులను, సిబ్బంది పట్టణ సి.ఐ.వెంకటరమణ, తణుకు రూరల్ సి.ఐ. డి. వెంకటేశ్వరరావు, తణుకు టౌన్ ఎస్ఐ శ్రీనివాస్, తణుకు ఎ.ఎస్ ఐ. శ్రీనివాస్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ, అప్పారావు, అక్బర్ లాల్,రవి, శివాజీ, వెలగేశ్వరరావు, పి రాంబాబు, రామారావు, చంద్రబోస్ వెంకటేశ్వరరావు ఎస్పీ అభినందించారని డిఎస్పీ వెల్లడించారు.



