శ్రీ రామకృష్ణ సేవా సమితి వేసవి శిక్షణా శిబిరంలో సైన్స్ ప్రయోగాలు

తణుకు సజ్జాపురంలోని శ్రీ రామకృష్ణ సేవాసమితిలో వివేకానంద హ్యూమన్ ఎక్సలెన్స్ సెంటర్ ఆధ్వర్యంలో జరుగుచున్న వేసవి శిక్షణా శిబిరంలో ప్రముఖ సైంటిఫిక్ మెజీషియన్ మరియు మోటివేషనల్ ట్రైనర్ బి. ఎం. గోపాల రెడ్డి ( గోపి మామ) చే విద్యార్థులకు సైన్స్ ప్రయోగాలు చేసి, విద్యార్థులతో చేయించి వాటిలో దాగి ఉన్న శాస్త్రీయ సూత్రాలు వివరించడం జరిగింది.
న్యూటన్ గమన సూత్రాలు, అపకేంద్ర బలము, శక్తి రూపాంతరము, బెర్ నౌలీ సూత్రము, ఘర్షణ, ధ్వని,గాలి పీడనము మొదలైన సైన్స్ సూత్రాలు నీటితో మంటలు, బాటిల్ రాకెట్, జంపింగ్ బాటిల్స్, బెలూన్ గేమ్స్, అదృశ్య అక్షరాలు, ధర్మకోల్ కటింగ్ మొదలైన కృత్యాలతో విద్యార్థులను అలరించాయి, ఆలోచింపచేసాయి. ఈ సందర్భంగా గోపాల రెడ్డి మాట్లాడుతూ విని, చదివిన విషయాల కంటే చూసి, చేసిన విషయాలు బాగా అర్థమవుతాయని, ఎక్కువ కాలం గుర్తు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినీ విద్యార్థులతోపాటు కోడూరి గిరీశ్వరరావు, వల్లభనేని రవీంద్ర, బొద్దాని శ్రీనివాస్, ఆకెళ్ళ సుబ్రహ్మణ్యం, సత్యనారాయణ రాజు, మణి తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link