ఇరగవరం పి హెచ్ సి నందు మంగళవారం ఆశా డే మీటింగ్లో ఈగల్ టీం, టొబాకో కంట్రోల్ ప్రోగ్రాం కార్యక్రమం ద్వారా మత్తు పదార్థాలకు పొగాకు ఉత్పత్తులకు యువత దూరంగా ఉండాలని, సైబర్ క్రైమ్ గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ వై. మౌనిక మాట్లాడుతూ పొగాకు ఉత్పత్తుల వాడకంవలన కలిగే దుష్పరిణామాలను, సైబర్ క్రైం నుండి ఎలా రక్షించుకొవాలో తెలిపారు. సైబర్ క్రైన్ జరిగిన మొదటి అరగంటలో 1930కి కాల్ చేసి ఫిర్యాదు చెయడం ద్వారా నష్టాన్ని భర్తీచేసుకొవచ్చు అన్నారు. ఈ అవగాహన సదస్సులో సిహెచ్ఓ ఎస్. కె. కాన్ సాహెబ్, పి హెచ్ ఎన్ ఏ. రాణి, ఈగల్ టీం నాగేశ్వరావు, ఎన్. టి.సి పి.జి.సాదు, సూపర్వైజర్లు, వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.



