జూన్ 6న మోడల్ కెరీర్ సెంటర్‌లో జాబ్ మేళా

నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు

– జిల్లా ఉపాధి అధికారి సి.హెచ్. శిరీష

తూర్పు గోదావరి జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జూన్ 6వ తేదీ (శనివారం) ఉదయం 10 గంటలకు రాజమహేంద్రవరం తాడితోట, మోడల్ కెరీర్ సెంటర్‌లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి సి.హెచ్. శిరీష మంగళవారం ఒక ప్రకటన లో తెలిపారు.

మిరకల్ సాఫ్ట్‌వేర్, ఠాగూర్ సంస్థలలోని పలు ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎస్‌ఎస్‌సీ, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ లేదా పీజీ అర్హత కలిగి, 19 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు గల అభ్యర్థులు పాల్గొనవచ్చన్నారు. ఎంపికైన వారికి తక్షణమే ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు.
ఆసక్తి గల అభ్యర్థులు employment.ap.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేసుకుని, రెజ్యూమే, ఆధార్ కార్డు, విద్యార్హతల ధ్రువపత్రాల జిరాక్స్ కాపీలతో జాబ్ మేళాకు హాజరు కావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9533221189 నంబర్‌ను సంప్రదించాలని తెలిపారు.

Scroll to Top
Share via
Copy link