బాలికల అండర్ 19 అథ్లెటిక్స్ రాష్ట్రస్థాయి పోటీలు అక్టోబర్ 22, 23వ తేదీలలో పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకులం జూనియర్ కళాశాలలో నిర్వహించడం జరిగింది. ఈ రాష్ట్ర స్థాయి పోటీలలో తణుకు ఎస్. కె.ఎస్.డి మహిళా జూనియర్ కళాశాలకు చెందిన కే. నందిని (ఫస్ట్ సీఈసీ) రిలే లో ద్వితీయ స్థానాన్ని సాధించిందని కళాశాల ప్రిన్సిపల్ భూపతిరాజు హిమబిందు తెలియజేశారు. ఈ సందర్భంగా జరిగిన అభినందన సమావేశంలో కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ చిట్టూరి సత్య ఉషారాణి పోటీలలో గెలుపొందిన విద్యార్థిని ప్రశంసిస్తూ కళాశాలలో కల్పించబడిన అనేక క్రీడా సౌకర్యాలు వినియోగించుకుని విద్యార్థులు అందరూ క్రీడలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి గెలుపొందాలన్నారు. ఈ సందర్భంగా విజేత కొండేటి నందినినీ అధ్యాపకులు కళాశాల సిబ్బంది అభినందించారు.


