సైన్స్ ఫెయిర్ 2025 లో తణుకు పిఎం శ్రీ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నుండి రాష్ట్రస్థాయిలో పాలి షెడ్‌తో ఫార్మింగ్ ద్వారా నీటి వృధాను అరికట్టవచ్చని వివరిస్తూ సైన్స్ ఫెయిర్ లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన సాసుపల్లి ధనభార్గవి ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ స్కాప్ తరపున ఢిల్లీలో నవంబర్ 6 నుండి 8వ తేదీ వరకు మూడో రోజులపాటు జరగబోయే సైన్స్ ఎక్స్పోజర్ అండ్ ఎడ్యుకేషనల్ టూర్ 2025 కు ఎంపిక రావడం జరిగిందని ప్రధానోపాధ్యాయులు కే. పద్మావతి తెలియజేశారు. ఈ సందర్భంగా సైన్స్ ఫెయిర్ కు గైడ్ టీచరుగా వ్యవహరించిన భౌతిక శాస్త్ర ఉపాధ్యాయురాలు జి.మాధవిలత, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కే.పద్మావతి లను తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ, తణుకు ఉప విద్యాశాఖ అధికారి డి.మురళి సత్యనారాయణ, ఎంఈఓ 2 బి. ఆంజనేయులు, పాఠశాల ఎస్ఎంసి కమిటీ సభ్యులు అభినందించారు.


