బాత్రూంలో అనుమానాస్పద మృతి

పాలంగి గ్రామానికి చెందిన అమీరిశెట్టి దుర్గాప్రసాద్ (45) లారీ డ్రైవర్ గా పనిచేస్తూ దూరప్రాంతాలకు డ్యూటీకి వెళ్లి వస్తు ఉంటాడని ఈ నేపథ్యంలో ఇటీవల డ్యూటీ నుండి ఇంటికి వచ్చిన అతను ఇంట్లోనే ఉండి తొమ్మిదవ తేదీ రాత్రి వరకు బంధువుల ఫోన్లకు కూడా స్పందించక పోవడం చేత అనుమానంతో బంధువులు అతను నివాసం ఉంటున్న ఇంటి వద్దకు వచ్చి చూడగా బాత్రూంలో అపస్మారక స్థితిలో పడి ఉండడంతో పొలీసులకు ఫిర్యాదు చేశారు. బంధువుల నుండి ఫిర్యాదు అందుకున్న ఉండ్రాజవరం పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, అనుమానాస్పదంగా మరణించడం చేత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఉండ్రాజవరం ఎస్సై డి.రవికుమార్ తెలియజేశారు.

Scroll to Top
Share via
Copy link