జర్నలిస్ట్‌ల పిల్లలకు శివశక్తి ఫౌండేషన్‌ మెరిట్ స్కాలర్‌షిప్‌లు

ఇంటి స్థలాలు సహా వారి అన్ని సమస్యలను పరిష్కరిస్తాం: జీవీ

రూ.210 కోట్లతో వినుకొండ మంచినీటిపథకం పూర్తి చేస్తాం: జీవీ

పర్యాటకక్షేతంగా రామలింగేశ్వర స్వామి ఆలయం

ఇంటర్ నుంచి పీజీ వరకు చదివే జర్నలిస్ట్‌ మిత్రుల పిల్లలకు ప్రోత్సాహకంగా శివశక్తి ఫౌండేషన్ తరఫున మెరిట్ స్కాలర్‌షిప్‌లు అందించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు వినుకొండ ఎమ్మె ల్యే, చీఫ్‌విప్ జీవీ ఆంజనేయులు. 30ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఎంతో ప్రోత్సాహం, సహకా రం అందించిన వారిపై గౌరవసూచకంగానే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. వచ్చే 5 ఏళ్లు కూడా ఇలానే ఇంటర్ నుంచి పీజీ వరకు చదివి జర్నలిస్ట్‌ల పిల్లలు ఒక్కొక్కరికీ రూ. 10వే ల చొప్పున ఉపకార వేతనాలు అందిస్తామన్నారు. వారంతా బాగా చదువుకుని భవిష్యత్‌లో ఉన్నత స్థానాలకు చేరుకోవాలన్నదే తన ఆకాంక్షగా పేర్కొన్నారు. ఆదివారం ఈ మేరకు శివశక్తి లీలా అండ్ అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 35 మంది విద్యార్థులకు రూ.10 వేలు చొప్పున అంద జేశారు. అనంతరం మాట్లాడుతూ గత ప్రభుత్వం జర్నలిస్ట్‌లకు ఇంటి స్థలాల విషయంలో నూ అన్యాయం చేసిందని త్వరలో వారికి రెండు సెంట్ల పట్టాలు ఇస్తామన్నారు. జర్నలిస్ట్‌ల కాల నీని రాష్ట్రంలోనే ఒక మోడల్ కాలనీగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తామన్నారు. జర్నలిస్ట్‌ల ఇతర పెండింగ్ సమస్యలు కూడా పరిష్కరిస్తామన్నారు. రూ. 210 కోట్లతో వినుకొండ పట్టణానికి శాశ్వతమంచినీటి పథకం తీసుకుని వస్తున్నామని, దానిద్వారా కొత్త కాలనీలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. ఇదే సమయంలో ఎన్నెస్పీ గ్రౌండ్‌లో ఇండోర్ స్టేడియం, పార్క్, షాదీఖానా, టీటీడీ కల్యాణమండపం, గుర్రం జాషువా డిజిటల్ లైబ్రరీ, స్విమ్మింగ్‌పూల్, హోల్‌సేల్ కూరగాయల మార్కెట్‌తో భవిష్యత్‌ అవసరాలకు సరిపడిన రీతిలో తీర్చిదిద్దుతాం. గడిచిన అయిదేళ్లలో అక్కడ కనీసం ఒక్క బిల్డింగ్ కట్టలేదని, వైకాపా ప్రభుత్వం లో వినుకొండకు ఒక్క పనిచేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న 5ఏళ్లలో రామలింగేశ్వ రస్వామి ఆలయం, ఘాట్‌ రోడ్ సహా ప్రతి పని పూర్తి చేస్తా. ఆ ఆలయాన్ని పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు చీఫ్‌విప్ జీవీ ఆంజనేయులు.ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు, జనసేన నాయకులు నాగ శ్రీను రాయల్, తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link