పంటలను ఆశించి రైతులకు విపరీతమైన నష్టాన్ని కలుగజేసే ఎలుకలను నివారించే కార్యక్రమంలో భాగంగా అత్తిలి మండలంలో గల అన్ని గ్రామాలలో శుక్రవారం సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందనీ మండల వ్యవసాయ అధికారి టి రాజేష్ తెలియజేశారు ఈ సందర్భంగా రైతు సేవా కేంద్రంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులందరికీ మందు కలిపిన విషపు ఎరను పంపిణీ చేయడం జరుగుతుందనీ, కావున రైతులందరూ వ్యవసాయ శాఖ ద్వారా చేస్తున్న ఈ సామూహిక ఎలుక నిర్మూలన కార్యక్రమం ద్వారా పంపిణీ చేయబడిన విషపు ఎరను ఎలుక కన్నాల దగ్గర పెట్టవలెను. రైతులందరూ సామూహికంగా ఈ ఎరను ఎలుక కన్నాల వద్ద ఉంచినట్లయితే సమర్థవంతంగా ఎలుకలను నిర్మూలించవచ్చునని ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఇప్పించారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సిబ్బంది రైతులు పాల్గొన్నారు.


