సచివాలయంలో పబ్లిసిటీ సెల్ విభాగంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి
మంత్రి లోకేష్ అందించిన ధైర్యంతో నేపాల్ లో చిక్కుకున్న ఏపీ వాసులు ఆనందం వ్యక్తం చేశారన్న మంత్రి దుర్గేష్
కూటమి ప్రభుత్వ చర్యలతో నేపాల్ నుండి రేపు సాయంత్రానికి స్వస్థలాలకు చేరుకోనున్న బాధితులు
అమరావతి : మంత్రి నారా లోకేష్ నిరంతర పర్యవేక్షణతో నేపాల్ లో చిక్కుకున్న ఏపీ బాధితులకు భరోసా కల్పించారని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. బుధవారం సచివాలయంలోని పబ్లిసిటీ సెల్ విభాగంలో మంత్రులు నారా లోకేష్, అనిత లతో కలిసి మీడియా సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ అనంతపురం లో జరిగిన సూపర్ సిక్స్- సూపర్ హిట్ పర్యటన రద్దు చేసుకొని రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ లో కూర్చుని నేపాల్ లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ పర్యాటకులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి లోకేష్ భరోసాని ఇచ్చారన్నారు. ప్రతి రెండు గంటలకు ఒకసారి అక్కడ చిక్కుకున్న బాధితులతో వ్యక్తిగతంగా మాట్లాడి ధైర్యం నింపారన్నారు. ఇలాంటి సందర్భాల్లో సాధారణంగా ఎవరైనా భయానికి, ఒత్తిడి కి, ఆందోళన కి లోనవుతారని, కానీ మంత్రి నారా లోకేష్ ఇచ్చిన ధైర్యంతో వాళ్లంతా చాలా సంతోషం వ్యక్తం చేసినట్లు మంత్రి దుర్గేష్ ఈ సందర్భంగా తెలిపారు. రేపు మధ్యాహ్నం నేపాల్ లో చిక్కుకున్న ఏపీ వాసులు అందర్నీ ఇండియాకి రప్పించే ఏర్పాట్లు చేస్తున్నామని, సాయంత్రానికి వారి వారి స్వస్థలాలకు పంపేలా అందరం చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ ఈ సందర్భంగా వెల్లడించారు.


