తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలో వేంచేసియున్న శ్రీ సిద్ధి వినాయక కుమారస్వామి వారి ఆలయంలో ఆలయ అర్చకులు గణపతి ఉపాసకులు గురుస్వామి బ్రహ్మశ్రీ శ్రీకాకుళపు నాగేశ్వర సూర్య సత్యనారాయణ మూర్తి ఆధ్వర్యంలో 60 మంది గణపతి మాల ధారణ చేసిన స్వాములు గురువారం చిత్తూరు జిల్లా లో ప్రసిద్ధిగాంచిన కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా భక్తిశ్రద్ధలతో గణపతి దీక్ష పూర్తిచేసిన స్వాములు కాణిపాకం శ్రీ వినాయక స్వామికి ఇరుముడి సమర్పించారు. ఈ సందర్భంగా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయ మర్యాదలతో ఏఈఓ నిడదవోలు గణపతి స్వాములకు స్వాగతం పలికారు. అనంతరం శ్రీకాకుళపు నాగేశ్వర సూర్యనారాయణమూర్తి గురుస్వామికి వేద పండితులు వేద ఆశీర్వచనం అందజేశారు.


