ఇరగవరం మండల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పేకేరు గ్రామంలో గురువారం పొలంబడి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సమావేశానికి హాజరైన రైతులను ఉద్దేశించి మండల వ్యవసాయ అధికారి వై.రాఘవేంద్రరావు మాట్లాడుతూ వరిలో ఆశించే పురుగులు తెగుళ్లు గురించి వివరిస్తూ వరిలో మోతాదుకు మించి పురుగుమందులు వాడకం వలన ఉపయోగకరమైన కీటకాలు సాలీడు అక్షింతల పురుగు వంటి మిత్ర పురుగులు చనిపోతున్నాయని, అదేవిధంగా పురుగుమందుల అవశేషాలు పేరుకుపోవడం వలన మానవ శరీరంలో ఈ పురుగుమందులు చేరి దీర్ఘకాలిక రోగాల బారిన పడుతున్నారని అన్నారు. అందువల్ల మంచి వ్యవసాయ పద్ధతుల ద్వారా ముందు నుండి పైరు ఎదుగుదలను గమనిస్తూ అవసరం మేరకు మాత్రమే పురుగుమందులను వాడవలెనని వ్యవసాయాధికారి సూచించారు. రైతులు ప్రస్తుతం చేలల్లో కాండం తొలిచే పురుగు నివారణకు ఏ విధమైన చర్యలు తీసుకోవాలని అడగగా కాండం తొలిచే పురుగు నివారణకు ముందుగా నత్రజని అందించే ఎరువులను మూడు దఫాలుగా వేసుకోవాలని ఒక చదరపు మీటర్లు రెండు గుడ్ల సముదాయం ఉంటేనే పిచికారి చేయాలని రైతులకు తెలిపారు లీటరు నీటికి కార్ టాప్ హైడ్రోక్లోరైడ్ రెండు గ్రాములు లేదా క్లోరం త్రినేలీ పోల్ 0.3 మిల్లీ లీటర్లు లీటర్ నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలని చిరు పొట్ట దశలో ఎకరానికి హైడ్రోక్లోరైడ్ 4g గుళికలు 8 కేజీలు లేదా కార్బోఫ్ యూరాన్ 3జి గుళికలు 10 కేజీలు లేదా క్లోరాంతరనిల్ ప్రో 0. 4జి గుళికలు నాలుగు కేజీలు వేసుకోవాలని తెలియజేశారు. ఇరగవరం మండలంలో అన్ని గ్రామాల రైతు సేవా కేంద్రాల వద్ద సామూహిక ఎలుకల మందు పంపిణీ కార్యక్రమం శుక్రవారం చేపట్టామని ఈ సందర్భంగా విషపు ఎర కలిపిన పొట్లాలను పంపిణీ చేయడం జరుగుతుందని రైతు సోదరులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని సామూహికంగా ఎలుకల నివారణ చేపట్టాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పేకేరు, ఏలేటిపాడు వ్యవసాయ సహాయకులు డి.శేష సాయి జి. హేమంత్, బి.ధనరాజు రైతులు పాల్గొన్నారు.


