స్థానికఎస్.కె.ఎస్.డి మహిళా డిగ్రీ కళాశాలలో ఉమెన్ డెవలప్మెంట్ సెల్, జాతీయ సేవాపథకము వారి సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం” సందర్భంగా అవగాహన నదన్సును నిర్వహించినారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపల్, కెప్టెన్ యు.ఎల్ సుందరీబాయ్ మాట్లాడుతూ 1960 సం॥లో అంతర్జాతీయంగా (ఎమ్. హెచ్. వో, డబ్ల్యూ. హెచ్. వో) సామూహికంగా బలవన్మరణాలను అరికట్టడానికి ఈ దినోత్సవాన్ని ప్రారంభించారని తెలియజేశారు. 18 సం॥రాలు నుండి 35 సం॥రాలు వయస్సువారు ఎక్కువుగా ఆత్మహత్య చేసుకుంటున్నారని చిన్న సమస్యకు చావు అనే పెద్ద నిర్ణయం తీసుకోవడం తప్పనీ, వ్యసనాలు, ప్రేమలో ఓడిపోవడం, ఆత్మానున్యతాభావం కల్గినప్పుడు ఆ సమస్య నుండి ఎలా బయట పడాలో ఆలోచించాలి తప్పా, ఆత్మహత్య పరిష్కారం కాదని తెలియజేసినారు.
ముఖ్య అతిధిగా విచ్చేసిన డా॥ బి.రమేష్ కుమార్ (న్యూరోసైకియాట్రిస్టు) మాట్లాడుతూ కుటుంబ కలహాలు, ఋణబాధలు, శారీరక, మానసిక ఆరోగ్యం సరిలేకపోవడం, ప్రేమ విఫలమవ్వటం మరియు పోటీ పరీక్షలలో, ఉద్యోగాలలో తీవ్ర ఒత్తిడికి లోనవడం వలన ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ సంవత్సరం 7 లక్షలు మంది చనిపోతున్నారని, ఎక్కువగా 18 నుండి 30 సం॥ముల వయస్సువారు ఎక్కువుగా ఉన్నారని స్త్రీ, పురుషులతో సంబంధం లేదని తెలియజేశారు. తల్లితండ్రులు, ఉపాధ్యాయులు ధైర్యం చెప్పాలని వీరికి అవసరమైతే సైకాలజిస్టుల కౌన్సిలింగ్ నిర్వహించాలని వారిని ఒంటరిగా ఉండకుండా చూడాలని, పాజిటివ్ ఆలోచనలు కల్గివుండేలా, వారి జీవితం మీద ఆశ కల్పించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉమెన్ డెవలప్మెంట్ సెల్ కన్వీనర్ శ్రీమతి వి.తులసీరత్నం, ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్స్ శ్రీ సి. హెచ్. రమేష్, శ్రీమతి కె.వి. శ్యామలాదేవి. సైకాలజిస్ట్ వి. ధనశేఖర్, అధ్యాపకులు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు


