రాష్ట్ర మాజీ పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తణుకు శాసనసభ్యులు రాధాకృష్ణ 1200 కోట్ల అవినీతి కి పాల్పడ్డారంటూ ఆరోపణలు చేయడంతో తణుకు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తమ వ్యక్తిత్వం సభ్యత సంస్కారం కలిగిన వ్యక్తి, యువకుడు ఆరిమిల్లి రాధాకృష్ణ సంవత్సరన్నర కాలంలో 1200 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారంటూ ప్రతిపక్ష నాయకుడు చేసిన ఆరోపణలపై రాష్ట్ర వీవర్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, తణుకు నియోజకవర్గ తెలుగుదేశం బీసీ నాయకురాలు వావిలాల సరళ దేవి బుధవారం బుధవారం తన కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ ఆరిమిల్లి రాధాకృష్ణ ప్రజల మనిషి అని అందరూ అభిమానించే వ్యక్తి అని ప్రతినిత్యం ప్రజల మధ్యలో ఉంటూ తణుకు నియోజకవర్గాన్ని అభివృద్ధి మార్గంలో నడిపిస్తూ, కూటమి ప్రభుత్వ సహాయ సహకారములతో నియోజకవర్గ ప్రజలకు మెరుగైన పరిపాలన అందించడానికి కృషి చేస్తున్న రాధాకృష్ణపై ఆరోపణలు మానుకోవాలని, సాధ్యమైతే అభివృద్ధిలో ఆయనతో పోటీ పడమని అంతేగాని లేనిపోని మాటలు అంటే సహించబోమని సరళాదేవి ఒక ప్రకటనలో తెలియజేశారు. నియోజకవర్గమంతా ఒక్క మాటపై ఆరిమిల్లి రాధాకృష్ణ వెంట నడుస్తూ జేజేలు కొడుతున్నారని ప్రతిపక్ష నేతగా కారుమూరి నాగేశ్వరరావు మాటలను ఖండిస్తున్నామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు.


