అనకాపల్లి జిల్లా: 20000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ కసింకోట మండలం నరసింగబిల్లి
వీఆర్వో సూర్య సాయి కృష్ణ పృథ్వి
*పాసుబుక్ చేస్తానని స్థానికుడి నుంచి లంచం డిమాండ్ చేస్తూ ఏసీబీకి చిక్కిన వీఆర్వో
మ్యుటేషన్ కోసం డబ్బులు డిమాండ్ చేసిన వీఆర్వో ఏసీబీ వలకు చిక్కాడు. బాధితుడి నుంచి డబ్బులు తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ బీవీఎస్ నాగేశ్వరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని జట్టపురెడ్డి తుని గ్రామానికి చెందిన రైతు ఊడి నాగేశ్వరరావు తన భూమికి సంబంధించి మ్యుటేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అనంతరం వీఆర్వో ను కలిశాడు. ఈ పనికోసం ఆయన లంచం డిమాండ్ చేశాడు. రూ.20వేలు ఇవ్వాలన్నాడు. దీంతో దుర్గారావు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు శనివారం వీఆర్వో సూర్య సాయి కృష్ణ పృద్వి గ్రామపంచాయతీ కార్యాలయంలోనే ఇరవై వేలు లంచం అందజేశాడు. పథకం ప్రకారం అప్పటికే అక్కడ మాటు వేసిన ఏసీబీ అధికారులు వీఆర్వో సూర్య సాయి కృష్ణ పృద్వి ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తామని డీఎస్పీ బీవీఎస్ నాగేశ్వరావు తెలిపారు.


